భారీ మొత్తానికి అమ్ముడైన ‘కాలా’ శాటిలైట్ హక్కులు !


తమిళ ప్రేక్షకులతో పాటు దక్షిణాది సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ కూడ ఒకటి. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై ట్రేడ్ వర్గాల్లో కూడ తారాస్థాయి అంచనాలున్నాయి. ఈ అంచనాల వలనే చిత్రం హక్కులకు యమ క్రేజ్ ఏర్పడింది.

ఇప్పటికే థియేట్రికల్ హక్కుల్ని లైకా ప్రొడక్షన్స్ కంపెనీ రూ. 125 కోట్లకి కొనుగోలు చేయగా ఇప్పుడు శాటిలైట్ హక్కుల్ని స్టార్ టీవీ రూ.75 కోట్లకి దక్కించుకుంది. తమిళం, తెలుగు, హిందీ మూడు భాషల హక్కులకు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించింది స్టార్ టీవీ. ఏప్రిల్ 27న విడుదలకానున్న ఈ చిత్రంలో రజనీ డాన్ పాత్రలో కనిపించనున్నారు.