‘అఖండ 2’ మేకర్స్ కి ఊరట.. న్యాయస్థానం చెప్పిందిదే!

‘అఖండ 2’ మేకర్స్ కి ఊరట.. న్యాయస్థానం చెప్పిందిదే!

Published on Dec 12, 2025 4:05 PM IST

akhanda 2

నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ మ్యాడ్ సీక్వెల్ కి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలా చివరి నిమిషంలో టికెట్ ధరల పరంగా కూడా పలు ఇబ్బందులు మేకర్స్ కి ఎదురు కావడం అవి మళ్ళీ రద్దు అయ్యాయి అని కొన్ని కాలేదు అని కొన్ని ఇలా చాలా గందరగోళం నడుమ సినిమా విడుదల అయ్యింది.

అయితే తెలంగాణ హై కోర్ట్ లో అఖండ 2 ప్రీమియర్స్ టికెట్ ధరలు ఇంకా సాధారణ రోజుల్లో టికెట్ ధరలు విషయంలో కూడా పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. మరి దీని నుంచి న్యాయస్థానం ఊరట కలిగించే తీర్పు ఇచ్చిందట. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో డివిజన్ బెంచ్ వారు ఈ 14 వరకు స్టే విధించారు. సో ఈ 14 వరకు టికెట్ రేట్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పాలి. ఇది చిత్ర యూనిట్ కి కూడా ఒకింత ఊరట కలిగించే అంశమే.. 15వ తేదీన తదుపరి విచారణ ఉంటుందట.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు