పవన్ బ్రేక్ చేయాల్సిన టార్గెట్స్ ఇవే

Published on Jan 14, 2021 3:00 am IST


‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ నుండి వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రేపే ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. పవన్ సినిమా అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అభిమానులు కూడ పాత రికార్డులను చూసుకుని మరీ వాటిని బ్రేక్ చేయాలని ట్రై చేస్తుంటారు.

ప్రస్తుతం టీజర్ వరకు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు తెలుగులో 24 గంటల్లో హయ్యస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ గా 14.65 మిలియన్ వ్యూస్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ ఉంది. అలాగే అత్యధిక లైక్స్ పొందిన టీజర్ గా 9 లక్షల 40 వేల లైక్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ యొక్క రామరాజు ఫర్ భీమ్ టీజర్ నిలిచింది. ఇప్పుడు ఈ రెండు రికార్డులను ‘వకీల్ సాబ్’ టీజర్ ద్వారా బ్రేక్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. మరి పవన్ ఆ టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ నెలలో సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్, క్రిష్ డైరెక్షన్లో ఇంకో చిత్రం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More