ఫ్యాన్స్ గెట్ రెడీ.. NC24 అప్డేట్ వచ్చేస్తోంది!

ఫ్యాన్స్ గెట్ రెడీ.. NC24 అప్డేట్ వచ్చేస్తోంది!

Published on Apr 26, 2025 11:01 AM IST

అక్కినేని నాగచైతన్య రీసెంట్‌గా ‘తండేల్’ మూవీతో సాలిడ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చైతూ ప్రస్తుతం నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. విరూపాక్ష ఫేమ్ దర్శకుడు కార్తిక్ దండుతో కలిసి ఓ భారీ మిస్టిక్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు. NC24 గా ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు.

ఈ సినిమా పూర్తి అడ్వెంచర్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. NC24 అప్డేట్‌ను ఏప్రిల్ 26 సాయంత్రం 4.05 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు