రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పై బిగ్ అప్ డేట్ !

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పై బిగ్ అప్ డేట్ !

Published on Mar 24, 2020 4:06 PM IST

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ షూట్ లోనే ఎడిట్ చేస్తున్నారట. అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

కాగా ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. అయితే సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. రాజమౌళి తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకొరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట.

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు