టీవీ కంటే ముందు ఓటీటీలో బిగ్‌బాస్..!

Published on Jul 10, 2021 1:06 am IST

ప్రముఖ రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్ తన పేరును మార్చుకుంది. బాలీవుడ్ దిగ్గజం సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రస్తుతం సీజన్ 15ను జరుపుకునేందుకు రెడీ అయ్యింది. అయితే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ సీజన్‌ను నిర్వాహకులు కాస్త కొత్తగా ప్లాన్ చేశారు. తాజాగా బిగ్‌బాస్‌ పేరును బిగ్‌బాస్‌ ఓటీటీగా మార్చి లోగోను విడుదల చేశారు. ఈ సీజన్‌ తొలి ఆరు వారాల ఎపిసోడ్స్‌ ఓటీటీలో ప్రసారమై, ఆ తర్వాత టీవీల్లోకి రానుంది.

అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్‌లో ఈ బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రసారం కానుంది. ఇదే కాకుండా ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ ఎంపిక నుంచి ప్రతివారం వారికి ఇచ్చే టాస్క్‌ల వరకు ఇకపై ప్రతిది ప్రేక్షకుల చేతుల్లోనే ఉండబోతుందట. ఈ సందర్భంగా వూట్‌ హడ్‌ ఫర్జాద్‌ పాలియా మాట్లాడుతూ డిజిట‌ల్ ఫ‌స్ట్ అనే త‌మ సంస్థ నినాదానికి అనుగుణంగా బిగ్‌బాస్ ఓటీటీ మ‌రో అడుగు అని చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు బిగ్‌బాస్‌ ఓటీటీను లాంచ్‌ చేయనున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం :