సరికొత్త హంగులతో ‘బిగ్ బాస్-2’ !
Published on May 16, 2018 1:09 pm IST

హిందీలో విజయం సాధించిన బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’. గత ఏడాది ఈ షోను తెలుగు ప్రేక్షకులకు పరచియం చేశారు. తెలుగులో ‘ఎన్టీఆర్’ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ప్రేక్షకులను బాగానే అకట్టుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు నిర్వాహకులు. దీనికి వ్యాఖ్యాతగా హీరో ‘నాని’ వ్యవహరించబోతున్నారు.

ఎన్టీఆర్ కంటే నాని ఎక్కువ రోజులు ఈ షోలో పాల్గొనానున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ సెకండ్ సీజన్ షో ఫార్మాట్ మారింది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌ని 70 రోజుల్లో ముగించారు. కానీ సెకండ్ సీజన్ కోసం మరో ముప్ఫై రోజులు పొడిగించారు. అంటే ఈసారి బిగ్ బాస్ సెకండ్ సీజన్ 100 రోజులు ప్రసారం కానుంది. అంతేగాక కొన్ని కొత్త కొత్త ఛాలెంజెస్ కూడా ఇందులో అదనంగా ఉండనున్నాయి.

హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో జూన్ 10 నుంచి సెకండ్ సీజన్ షూట్ ప్రారంభంకానుంది. ఈ సీజన్ లో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్ జాబితాను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈసారి సామాన్యులకి కూడా ఈ షోలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు స్టార్ మా నిర్వాహకులు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు