‘బిగ్ బాస్ 3’ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

‘బిగ్ బాస్ 3’ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

Published on May 14, 2019 9:00 PM IST

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కానీ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఇక ఈ సారి బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరు చేస్తున్నారో అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే విక్టరీ వెంకటేష్ హోస్ట్ గా దాదాపుగా ఖాయం అయ్యారని సమాచారం.

కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కూడా ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ప్రధానంగా సీరియల్ యాక్టర్ జాకీ, కమల్ కామరాజు, గుత్తా జ్వాల, వరుణ్ సందేశ్ లాంటి సెలెబ్రిటీలు, బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు