బిగ్ బాస్ 4- అతన్ని కాపాడుతుంది అదేనట !

Published on Sep 28, 2020 4:08 pm IST

బిగ్‌ బాస్ నాలుగో సీజ‌న్‌లో నిన్న జరిగిన ఎలిమినేష‌న్ లో ప్రముఖ న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేట్ అవ్వడం చాలా మందికి షాక్ కి గురిచేసింది. మొదట మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వచ్చాయి, కాని చివరికి, ఆశ్చర్యకరంగా, దేవి ఎలిమినేట్ అయింది.
అయితే దేవి నాగ వల్లితో పోల్చినప్పుడు మెహబూబ్ అంటే పెద్దగా ఎవ్వరికీ తెలియని వ్యక్తి. కానీ అతనికి ఆడియన్స్ నుండి విశేషమైన సపోర్ట్ దొరకడానికి కారణం ఏమిటి అని అరా తీస్తున్నారు నెటిజన్లు.

కాగా సోషల్ మీడియాలో మెహబూబ్ కి ఎక్కువగా యువతరంలో మంచి ప్రజాదరణ ఉంది.. వారే అతనికి విపరీతంగా ఓట్స్ వేసి అతన్ని ఎలిమినేట్ కాకుండా కాపాడారట. యూట్యూబ్‌లో తన డ్యాన్స్ వీడియోలతో మెహబూబ్ బాగా ప్రాచుర్యం పొందాడు, ఆ రకంగా అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది.

పైగా మెహబూబ్ గుంటూరుకు చెందిన వ్యక్తి. కాబట్టి, జిల్లా మొత్తం నుండి అతనికి మద్దతుగా ఓట్లు వేస్తున్నారట. గుంటూరు జిల్లాకి చెందిన యాక్టివ్ గా ఉన్న సోషల్ మీడియా గ్రూప్స్ అన్నిటిలో మెహబూబ్ కి ఓట్లు వేయమని మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారట. అందుకే మెహబూబ్ కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More