బిగ్‌బాస్ 5: గ్రాండ్ ఫినాలేకు అతిథులు ఎవరంటే?

Published on Dec 14, 2021 1:15 am IST

బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ అప్పుడే క్లైమాక్స్‌కి వచ్చేసింది. మరో వారం రోజుల్లో విన్నర్ ఎవరో అన్నది తెలియనుంది. అయితే డిసెంబర్‌ 19న జరగనున్న ఈ గ్రాండ్‌ ఫినాలేను నెవర్‌ బిఫోర్‌ అనే రేంజ్‌లో నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్‌కు మొదట్లో “ఆర్‌ఆర్‌ఆర్‌” టీమ్‌ ముఖ్య అతిథులుగా వస్తారంటూ ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి అతిథితులను తీసుకురాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. స్టార్‌ జంట రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలతో పాటు బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ అలియా భట్‌ను సైతం గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథులుగా పిలుస్తున్నారని, అలాగే టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ సైతం షోలో సందడి చేయనున్నాడట.ఇప్పటికే నిర్వాహకులు అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. ఇదే కనుక నిజమైతే ఫైనల్ ఎపిసోడ్ మామూలుగా ఉండదనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :