బిగ్‌బాస్ 5 ఆ డేట్‌కి ఫిక్స్ అయినట్టేనా?

Published on Jul 31, 2021 10:00 pm IST

తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను కూడగట్టుకుంది. అయితే ఐదో సీజన్ ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా అది కాస్త వాయిదా పడింది. అయితే సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, పరిస్థితులు కాస్త సర్ధుకుంటే సెప్టెంబర్ 5వ తేదిన ఈ షోను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సారి హౌస్‌లోకి వెళ్ళే వారి జాబితా ఇదే అంటూ గత కొద్ది రోజులుగా కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ లిస్ట్ ఓ సారి చూస్తే యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, గెటప్ శ్రీను, రఘు మాస్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా, సురేఖ వాణి, సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా, యూట్యూబర్ సిరి హనుమంతు, లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, సీరియల్ నటులు సిద్ధార్థ్ వర్మ అండ్ భార్య విష్ణు ప్రియ, టీవీ 9 ప్రత్యూష పేర్లు అందులో ఉన్నాయి. మరి ఈ లిస్ట్‌లో ఉన్న వారిలో ఎంత మంది హౌస్‌లోకి వెళతారో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :