అభిజీత్ కు ఊహించని షాకిచ్చిన “బిగ్ బాస్” అండ్ నాగ్.!

Published on Nov 28, 2020 4:44 pm IST

అసలు ఈ వారం అంతా బాగా బోరింగ్ గా సాగుతుంది ఏంటా అనుకున్న బిగ్ బాస్ సీజన్ 4 లో ఇప్పుడు ఈ వీకెండ్ ను ఊహించని విధంగా రసవత్తరంగా మేకర్స్ ప్లాన్ చేసారు. ఇన్ని రోజులో బిగ్ బాస్ హౌస్ లో మంచి టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా నిలిచిన కంటెస్టెంట్ అభిజీత్ పై కింగ్ నాగ్ ఫైరవ్వడం ఆశ్చర్యం కలిగించింది.

ముఖ్యంగా క్యాప్టెన్ అయిన హారికాను నాగ్ డైరెక్ట్ గానే అభిజీత్ ను ఎందుకు సేఫ్ చేస్తున్నావ్ టాస్క్ చెయ్యకపోతే చేయించాల్సిన భాద్యత నీపై ఉందని సూటిగా అడగడం అలాగే అభిజీత్ ను టాస్కులు ఎందుకు చెయ్యడం లేదు చెయ్యనని చెప్పడం తప్పు కాదా అని ప్రశ్నించారు.

అలాగే మోనాల్ ఎందుకు ఏడిపించావ్ అని ఓ క్లిప్పింగ్ వేసి అభిజీత్ కు మాట లేకుండా చేసారు. ఇక ఫైనల్ గా అభి తో మాట్లాడుతూనే డోర్స్ ఓపెన్ చేశారు. దీనితో ఈరోజు ఎపిసోడ్ మాత్రం మంచి రసవత్తరంగా మారింది. మరి ఫైనల్ గా ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More