బిగ్ ఆఫర్ దక్కించుకున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి..!

Published on Aug 8, 2021 12:04 am IST

బిగ్‌బాస్ బ్యూటీ దివి వడ్త్యకు యూత్‌లో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. బిగ్‌బాస్ సీజన్‌-4కు ముందు దివి పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాక కేవలం బుల్లితెర వీక్షకులకే కాకుండా వెండితెర ప్రేక్షకులకు కూడా దివి బాగా దగ్గరయ్యింది. తన అందం, అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇటీవల క్యాబ్‌ స్టోరీస్‌తో హీరోయిన్‌గా అలరించిన ఈ సొట్టబుగ్గల సుందరీకి తాజాగా మరో ఆఫర్‌ వచ్చినట్టు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “సోగ్గాడే చిన్నినాయన” దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఓ వెబ్‌సిరీస్‌లో దివిని హీరోయిన్‌గా తీసుకున్నారట. దీనికి కళ్యాణ్ కృష్ణ కథ అందించడంతో పాటు ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :