ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ నడుమ టైటిల్ సమరం నడుస్తుంది. అయితే ఈ టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అభిజీత్ కు కూడా సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగ్ ఉంది. తనదైన గేమ్ తో అభిజీత్ ఇక్కడి వరకు వచ్చాడు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం అభిజీత్ కు బిగ్ బాస్ ఇచ్చిన లైన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి.
బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ మెచ్యూర్డ్ కంటెస్టెంట్ అనే కాకుండా అభిజీత్ లాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఉండడం ఈ షోకే గర్వకారణం అని చెప్పడం గమనార్హం. ఇది మాత్రం టైటిల్ ను మించిన విజయమే అని చెప్పాలి. ఇంకా అలాగే అభి పై కట్ చేసి చూపించిన వీడియో అయితే అతడే విన్నర్ అనే రేంజ్ లో మైండ్ బ్లోయింగ్ గా చూపించారు.
అంతే కాకుండా ఒక ఫైనెస్ట్ కంటెస్టెంట్ గా అభిజిత్ కు కితాబిచ్చి మోస్ట్ వరస్ట్ కంటెస్టెంట్ నుంచి అతని లాంటి కంటెస్టెంట్ హౌస్ లో ఉండడం గర్వకారణం అనే చెప్ప స్థాయికి వచ్చాడని చెప్పడం విశేషమే అని చెప్పాలి. మరి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ కు అభిజీత్ కూడా గట్టి పోటీనే ఇచేలా ఉన్నాడని చెప్పాలి.


