‘బిగ్ బాస్ 4’ కోసం ఎన్టీఆర్ తో స్పెషల్ ప్లాన్ ?

Published on Dec 5, 2019 9:07 am IST

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్ గా ఎన్టీఆర్ నే మళ్ళీ ఒప్పించాలని.. అప్పటిలోగా ఎలాగూ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిపోతుంది కాబట్టి, ఎన్టీఆర్ కూడా ఒప్పుకుంటారని.. అయితే ఈ సారి ఎన్టీఆర్ తో బిగ్ బాస్ ను చాల డిఫరెంట్ గా ఓ స్పెషల్ ప్లాన్ చేయాలని.. నిర్వహలు ఇప్పటినుండే చర్చలు జరుపుతున్నారట.

ఇక నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయినా.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వచ్చిన మూడో సీజన్ మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఈ సీజన్ లో మొత్తం 17 కంటెస్టెంట్స్ తో హోరా హోరీగా సాగి చివరికి విజేతగా రాహుల్ నిలిచాడు. మొత్తానికి బుల్లితెర‌ పై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న ఈ రియాలిటీ షో నుండి రాబోయే సీజన్ 4 లో మళ్లీ ఎన్టీఆర్ కనిపిస్తే ఇక మళ్ళీ పీఆర్పీ రేటింగ్స్ బద్దలు అవ్వడం ఖాయం.

సంబంధిత సమాచారం :

More