పాటతో మెస్మరైజ్ చేయబోతున్న బిగ్‌బాస్-4 రన్నరప్ అఖిల్.!

Published on Jun 30, 2021 11:27 pm IST


బిగ్‌బాస్ సీజన్-4 రన్నరప్ అఖిల్ టైటిల్ గెలవలేకపోయిన తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నాడన్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే మరోసారి అఖిల్ మనందరి హృదయాలను కొల్లగొట్టేందుకు మన ముందుకు రాబోతున్నాడు. స్టార్ మాలో ప్రముఖ యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4లో భాగంగా ఈ వారంలో వచ్చే ఎపిసోడ్‌కు అఖిల్ వస్తున్నాడు.

అయితే ఈ వీకెండ్ మస్తీకి రాబోతున్న అఖిల్ పాట పాడి అందరిని మెస్మరైజ్ చేయబోతున్నాడు. ‘చిన్నారి తల్లి చిన్నారి తల్లి నీ నింగి జాబిలి’ అంటూ అఖిల్ పాడిన పాట నిజంగా అందరి హృదయాలను హత్తుకోబోతుందని చెప్పాలి. అయితే అఖిల్ పాట పాడి మెస్మరైజ్ చేసిన ఈ ఎంటర్‌టైన్మెంట్‌ను మిస్ కాకూడదంటే ఈ వీకెండ్ స్టార్ మాలో వచ్చే సిక్స్త్ సెన్స్ ఎపిసోడ్‌ను తప్పక చూడాల్సిందే. ఇక అంతవరకు ఈ ప్రోమోను ఒకసారి చూడండి.

సంబంధిత సమాచారం :