బిగ్‌బాస్ సీజన్ 5 ప్రోమో.. గన్ పట్టుకుని వచ్చేసిన నాగ్..!

Published on Aug 14, 2021 9:00 pm IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న “బిగ్‌బాస్‌” ఎంతో మంది ప్రేక్షక అభిమానులను కూడగట్టుకుంది. అయితే ఐదో సీజన్ ఎప్పుడెప్పుడా అని గత కొద్ది రోజులుగా ప్రతి ఒక్కరు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఐదో సీజన్‌ లోగోకి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసిన నిర్వాహకులు తాజాగా సర్‌ప్రైజ్ ఇస్తూ మరో ప్రోమోను రిలీజ్ చేశారు.

అయితే ప్రోమో గురుంచి చెప్పుకోవాల్సిందేమిటంటే ఈ సారి సీజన్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున రావడం లేదని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ప్రోమో చూసాక ఈ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా చేయబోతున్నాడన్న క్లారిటీ అయితే అందరిలోనూ వచ్చేసింది. ఇక మొట్టమొదటిసారిగా ఓ మ్యూజిక్‌ వీడియో రూపంలో విడుదల చేసిన ఈ ప్రోమోలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దునియా మొత్తం బోరింగ్‌గా ఫీల్ అవుతూ ఫుల్ డల్ మూడ్‌లో కనిపిస్తారు. వీరి ముందు మిస్టర్. బోర్ అనే ఓ బుడ్డోడి ఆకారం కుప్పి గెంతులు వేస్తూ అందరిని వెక్కిరిస్తుంటుంది.

అప్పుడే గన్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మిస్టర్. బోర్ అనే ఆ బుడ్డోడి ఆకారాన్ని వినోదమనే బుల్లెట్‌లతో కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరిలో ఆనందమనే వెలుగు నిండుతుంది. అయితే ఈ సారి నాగ్ మరింత స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అయితే ప్రోమోనే ఇలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారంటే గత సీజన్‌లతో పోలిస్తే ఈ సారి సీజన్‌ను మరింత ఆహ్లాదాన్ని పంచేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :