ఫైనల్ గా ఓ సిరీస్ లో ‘బిగ్ బాస్’ సెన్సేషన్ అభిజీత్.!

ఫైనల్ గా ఓ సిరీస్ లో ‘బిగ్ బాస్’ సెన్సేషన్ అభిజీత్.!

Published on Jan 11, 2024 10:55 AM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో కోసం అందరికీ తెలిసిందే. మరి విజయవంతంగా బుల్లితెర మీద ఈ సిరీస్ మొత్తం 7 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇక షో లో సీజన్ 4 విన్నర్ అయినటువంటి అభిజీత్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పటికీ ఈ షో ఫాలోవర్స్ మాట్లాడుకుంటారు. కానీ అనూహ్యంగా తాను షో నుంచి బయటకు వెళ్ళాక మరిన్ని సినిమాల్లో కనిపిస్తాడు అని ఆశించారు.

కానీ అందుకు భిన్నంగా అభిజీత్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. మరి ఫైనల్ గా అయితే ఓ వెబ్ సిరీస్ లో తాను ఇప్పుడు సందడి చేయబోతున్నాడు. యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ సహా తాను నటించిన ఓ వెబ్ సిరీస్ అతి త్వరలో డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. “మిస్ పర్ఫెక్షన్” అంటూ ఓ కూల్ ప్రోమోతో మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ అనౌన్సమెంట్ అభిజీత్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ గా మారింది. మరి ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు