“RRR” నుంచి బిగ్గెస్ట్ ట్రీట్ కి ముహూర్తం ఖరారు.!

“RRR” నుంచి బిగ్గెస్ట్ ట్రీట్ కి ముహూర్తం ఖరారు.!

Published on Jul 27, 2021 11:05 AM IST


ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “RRR” నుంచి మేకర్స్ అదిరే అప్డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో భాగంగానే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న దేశ వ్యాప్త మ్యూజిక్ లవర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రత్యేకమైన ఫస్ట్ సింగిల్ పై ఈ రోజు 11 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

మరి చెప్పినట్టు గానే మొట్ట 5 భాషల్లో ప్లాన్ చేసిన ఈ స్పెషల్ సాంగ్ ను ముందు అనుకున్నట్టుగానే వచ్చే ఆగష్టు 1 ఫ్రెండ్షిప్ డే కానుకగా ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ముహూర్తం ఖరారు చేశారు. ప్రతి ఒక్కరు కూడా కీరవాణి అందించిన ఈ హిస్టారిక్ ఆల్బమ్ సంగీతం వినాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఆరోజు ఇంకొన్ని రోజుల్లోనే రావడానికి సిద్ధంగా ఉంది సో మంచి సౌండ్ సిస్టంతో సిద్ధంగా ఉండండి.. ఇది వరకే మేకింగ్ వీడియోకే ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో విన్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు