దీపావళి చిత్రాలు హాఫ్ సెంచరీ కొట్టాయి

Published on Dec 14, 2019 6:54 am IST

ఈ దీపావళికి విడుదలైన రెండు కోలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద టపాసుల్లా పేలాయి.అవే విజయ్ నటించిన బిగిల్ మూవీ కాగా మరొకటి కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ చిత్రం. ఈ రెండు చిత్రాలు దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదల కావడం జరిగింది. తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైన ఖైదీ, విజిల్ చిత్రాలు 50రోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ రెండు చిత్రాలు రెండు భాషలలో విజయం సాధించడం విశేషం. యంగ్ డైరెక్టర్ అట్లీ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన బిగిల్ మూవీ 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియా పరిధిలోనే 200కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రంగా బిగిల్ నిలవడం విశేషం. ఇక తెలుగులో ఈ చిత్రం 10కోట్లకు పైగా వసూళ్లతో విజయ్ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది.

ఇక దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ఖైదీ కార్తీ కెరీర్ లో 100కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం ఒక రాత్రి నడిచే యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి దర్శకుడు విజయం సాధించారు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు అర్థ శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఖైదీ దర్శకుడైన లోకేష్ కనకరాజ్ తో ఇప్పుడు విజయ్ తన 64వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :

X
More