విక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా బిందు మాధవి?

vikram-bindumadavi
స్టార్ స్టేటస్ ఉన్న ఏ హీరో ఆలోచించడానికి కూడా ఇష్టపడని తరహా పాత్రలు ఎన్నో చేసి తమిళంతో పాటు తెలుగులోనూ నటుడిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్. ఈమధ్యే ఆయన హీరోగా నటించిన ‘ఐ’ విడుదలై విక్రమ్ ఏ స్థాయి నటుడన్నది మరోసారి ఋజువు చేసింది. ఐ సినిమా కోసం రెండేళ్ళ పాటు వేరే ఇతర సినిమాను ఒప్పుకోని విక్రమ్, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

ఇందులో మురుగదాస్ నిర్మాతగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ’10 ఎంద్రకుల్ల’ ఒకటి కాగా, మురుగదాస్ శిష్యుడు, అరిమ నంబి ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందే ‘మర్మ మణితన్’ (ఎవరికీ అర్థం కాని మనిషి) మరొకటి. విక్రమ్, సమంతలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ’10 ఎంద్రకుల్ల’ షూటింగ్ చివరిదశకు చేరుకోగా, ఆ సినిమా పూర్తి కాగానే ‘మర్మ మరితణ్’ మొదలుకానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్, ప్రియా ఆనంద్‌లు ఎంపిక కాగా, ఈ మధ్యే ప్రియా ఆనంద్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. దీంతో ఆ ప్లేస్‌లో హీరోయిన్‌గా ఎవరిని సెలెక్ట్ చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు తెలుగు, తమిళ ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసిన బిందు మాధవి, విక్రమ్ ‘మర్మ మణితన్‌’కు హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగి విక్రమ్ సినిమాలో కనిపించే అవకాశాన్ని సొంతం చేసుకుంటే తెలుగు భామ బిందు మాధవికి ఇది లక్కీ చాన్స్ అనే చెప్పాలి!

Exit mobile version