ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ రోల్ లో బిత్తిరి సత్తి !

Published on May 7, 2019 2:46 pm IST

ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ , కమెడియన్ బిత్తిరి సత్తి కి సినిమాల్లో ఆపర్లు వచ్చిన స్క్రీన్ ఫై తక్కువ సేపే కనిపించడంతో సరైన బ్రేక్ రాలేదు. అయితే ఇప్పుడు సత్తి ఫస్ట్ టైం ఓ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నాడు. సీనియర్ డైరెక్టర్ తేజ, సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా సీత అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రంలో ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనున్నాడు సత్తి. సినిమాలో ఆయన పాత్ర హైలెట్ అవుతుందట. ఇటీవల విడుదలైన టీజర్లో కూడా సత్తి రోల్ ను రివీల్ చేయలేదు.

ఇక సత్తి కోసం హిలేరియస్ రోల్ ను డిజైన్ చేశాడట తేజ. తేజ మార్క్ కామెడీ కి సత్తి టైమింగ్ తోడైతే సినిమా మరో రేంజ్ లో వుండడం ఖాయం. మరి ఈ చిత్రమైన సత్తి కి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 24న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More