స్టార్ హీరో సూర్యకు ముందస్తు హెచ్చరిక..!

Published on Jul 6, 2021 3:02 am IST


సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సినీ ప్రముఖులు బాహాటంగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇటీవల స్టార్ హీరో సూర్య కూడా కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఆయన అన్నారు.

అయితే సూర్య వ్యాఖ్యలపై తమిళ బీజేపీ యువజన విభాగం మండిపడింది. సూర్య తన సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకోవాలని, ఇతర విషయాలపై అనవసరంగా జోక్యం చేసుకోవద్దని అన్నారు. ఇకపై సూర్య తన తీరు మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాఫిక్ కాగా వీటిపై సూర్య ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :