బ్లూ స్కై సినిమాస్ చేతికి జెర్సీ ఓవర్సీస్ హక్కులు !

బ్లూ స్కై సినిమాస్ చేతికి జెర్సీ ఓవర్సీస్ హక్కులు !

Published on Feb 17, 2019 11:05 AM IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘జెర్సీ’ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాని క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఇక ఈచిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను బ్లూ స్కై సినిమాస్ సొంతం చేసుకుంది. ఇటీవల వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ ను కూడా అక్కడ ఈ సంస్థే రిలీజ్ చేసి మంచి లాభాలను రాబట్టుకుంది. ఇక క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ జెర్సీ ఫై మంచి అంచానాలు నెలకొన్నాయి.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఆమె కు ఇదే మొదటి సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు