’సర్దార్ గబ్బర్ సింగ్’ లో కాజల్ డబ్బింగ్ చెప్పిందా..?

kajal-and-bobby
ఇప్పుడు హీరోయిన్లు వరుసపెట్టి అందరూ డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఇటీవల రకుల్, సమంత, తమన్నా ఇలా అందరూ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవడంతో వాళ్ళని ఆదర్శంగా తీసుకుందో ఏమో కాజల్ అగర్వాల్ కూడా ’సర్దార్ గబ్బర్ సింగ్’ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు ’సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ లో చెప్పిందామె. డబ్బింగ్ చెప్పేటపుడు మొదట్లో బయపడ్డా తరువాత చాలా ఈజీగా అనిపించింది అని కూడా చెప్పింది. ఆమె మాటలతో కాజల్ వాయిస్ వినే భాగ్యం కలిగిందని ఆమె అభిమానులు సంబరపడ్డారు కూడా..

ఇది ఇలా ఉండగా ’సర్దార్ గబ్బర్ సింగ్’ దర్శకుడు బాబీ మాత్రం కాజల్ అగర్వాల్ తెలుగు వెర్షన్ కి డబ్బింగ్ చెప్పలేదని…కేవలం హిందీ వెర్షన్ కి మాత్రమే కాజల్ డబ్బింగ్ చెప్పినట్లు తెలుగు వెర్షన్ కి మాత్రం వేరే వారితో డబ్బింగ్ చెప్పించినట్లు చెపుతున్నాడు. నిజానికి కాజల్ తెలుగు ’సర్దార్ గబ్బర్ సింగ్’ కి డబ్బింగ్ చెప్పిందా లేదా అన్నది తెలియాలంటే మరో 36 గంటలు వేచి చూడాల్సిందే.

Exit mobile version