తెలుగు సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్ ?

Published on May 2, 2019 5:56 pm IST

నానా పటేకర్ ఎంతటి గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన కోసం త్రివిక్రమ్ ఓ బలమైన్ క్యారెక్టర్ రాశాడట. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ రాబోతున్న సినిమాలో నానా పటేకర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారట. అలాగే రానా సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో వస్తోన్న విరాటపర్వంలో కూడా పటేకర్ కనిపించన్నట్లు తెలుస్తోంది. అటు రెండు తమిళ్ ఫిల్మ్స్ లో కూడా నానా పటేకర్ నటిస్తున్నాడు.

మొత్తానికి నానా పటేకర్ తెలుగు సినిమాల్లో కూడా బిజీ అవుతోన్నాడు అన్నమాట. ఎలాంటి ఎమోషన్ని అయినా, ఎలాంటి డైలాగ్ నైనా కేవలం తన నటనతో తన మాడ్యులేషన్ తో వాటిని మరో స్థాయికి తీసుకెళ్లి ఇంకా అద్భుతంగా మలచగలరు నానా పటేకర్. ఇటీవలే ‘కాలా’ సినిమాలో విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు ఆయన. మరి ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఎలాంటి విలనిజాన్ని పండిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More