ఇస్మార్ట్ శంకర్ లో బాలీవుడ్ విలన్ !

Published on Jan 29, 2019 8:44 am IST

రామ్ -పూరి కలయికలో తెరకెక్కుతున్నచిత్రం ఇస్మార్ట్ శంకర్ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లో జరుగుతుంది. ఈమొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 21 వరకు జరుగనుంది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే నటించనున్నాడు. ఆయన ఇటీవల 2.0 లో కూడా నెగిటివ్ రోల్ లో కనిపించారు.

ఇక ఈచిత్రంలో రామ్ సరసన నాబా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది. యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More