
రామ్ చరణ్ నటిస్తున బ్రూస్ లీ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతుంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమాను విడుదలచేసేందుకు చిత్ర బృందం శ్రమిస్తుంది. ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.
తాజా కధనాల ప్రకారం ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ భామ టిస్కా చోప్రాను ఎంపిక చేసుకున్నారట. ఈ మధ్య బడా బాలీవుడ్ చిత్రాలలో సహాయ పాత్రలు పోషిస్తున్న ఈ భామ గతంలో హీరోయిన్ గా అలరించింది.ఈ సినిమాను డి,వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.

