రవితేజతో బాలీవుడ్ బ్యూటీ ?

Published on Jul 15, 2019 12:00 am IST

మాస్ మహారాజ రవితేజ ప్రజెంట్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. దీని తర్వాత చేయడానికి ఆయన చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలోఒకటి గోపీచంద్ మలినేని సినిమా కాగా, ఇంకొకటి ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహాసముద్రం’.

ఈ స్క్రిప్ట్ మీద చాలా రోజుల నుండి వర్క్ చేసున్న అజయ్ భూపతి రవితేజను సినిమాకు ఒప్పించారట. దీంతో రవితేజ నెక్స్ట్ ఈ సినిమానే స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో కథానాయకి పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ హైదరిని సంప్రదిస్తున్నారని వినికిడి.’సమ్మోహనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి తొలి ప్రయత్నంలోనే అభినయం, అందంతో విశేషంగా ఆకట్టుకుంది. ఒకవేళ ఆమె గనుక ఈ చిత్రంలో నటిస్తే అది సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :

X
More