“బిగ్ బాస్” హోస్ట్ గా బాలీవుడ్ బడా నిర్మాత.!

Published on Jul 24, 2021 3:00 pm IST


మన ఇండియన్ టెలివిజన్ హిస్టరీ లోనే కాకుండా మొత్తం ప్రపంచ టెలివిజన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో భాషల్లో విజయవంతంగా ఎన్నో సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో మన దగ్గర కూడా అన్ని భాషల్లోనూ చాలా పాపులర్.

అయితే హిందీలో ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్త సీజన్ తో రెడీ అవుతుంది. మరి దీనిపై ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిందీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చెయ్యగా ఈసారి అక్కడి బడా చిత్రాల నిర్మాత మరియు దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేయనున్నాడట.

అలాగే ఈ వెర్షన్ షో ఓటిటిలో స్ట్రీమ్ కానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ షో ప్రీమియర్ వచ్చే ఆగష్టు 8 నుంచి మొదలు కావడానికి రెడీగా ఉందని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇక్కడ నుంచి “బాహుబలి”, ఇప్పుడు విజయ్ దేవరకొండ “లైగర్” లాంటి సినిమాలను ప్రెజెంట్ చేసిన కరణ్ ఈ షోని ఎలా హోస్ట్ చేస్తాడో అని బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :