బాహుబలి సన్నివేశం కి ఫిదా అయినా హాలీవుడ్ డైరెక్టర్.

Published on Aug 9, 2019 12:05 am IST

బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు ఎన్ని సంచలనాలు నమోదు చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రంగా బాహుబలి నిలిచింది. ఐతే ఈ మూవీ మరో అరుదైన ప్రసశంసను పొందడం జరిగింది. హాలీవుడ్ లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన స్కాట్ డెరిక్సన్ కి బాహుబలి చిత్రంలోని ఓ సన్నివేశం బాగా నచ్చిందట. ఇలాంటి అరుదైన అద్భుత సన్నివేశం నేనెప్పడూ చూడలేదు. అని ట్వీట్ చేశారు.

బాహుబలి 2 చిత్రంలో పతాక సన్నివేశంలో భల్లాల దేవా కోటలోకి ప్రవేశించడానికి బాహుబలి సైన్యం తాడిచెట్లను ఉపయోగించుకొని కోటలోకి ప్రవేశిస్తారు. ఆ సన్నివేశంపై సదరు హాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. కాగా స్కాట్ హాలీవుడ్ లో స్నిస్టర్స్, డాక్టర్స్ స్ట్రేంజ్ వంటి చిత్రాలు తీశారు.

సంబంధిత సమాచారం :