ధనుష్‌తో తప్పకుండా సినిమా చేస్తానంటున్న బాలీవుడ్ దర్శకుడు

ధనుష్‌తో తప్పకుండా సినిమా చేస్తానంటున్న బాలీవుడ్ దర్శకుడు

Published on Nov 28, 2019 3:00 AM IST

Dhanush Nawb

ధనుష్ కేవలం తమిళంలో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఆయన చేసిన ‘అసురన్’ సినిమాను అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ దర్శకుడు షహమాస్ నవాబ్ సిద్దిఖీ 50 ఏళ్ల పెద్ద వయస్కుడిగా ధనుష్ నటన ఎంతో గొప్పగా ఉందని పొగిడిన ఆయన త్వరలో మంచి స్క్రిప్ట్ తయారుచేసి ధనుష్‌తో తప్పకుండా సినిమా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు.

సో.. త్వరలో ధనుష్ హిందీ సినిమా చేయడం పక్కా అనుకోవచ్చు. బాలీవుడ్ ప్రేక్షకులకు ధనుష్ కొత్తేమీ కాదు. ఆయన మొదటి సినిమా ‘రాన్ జానా’తోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే రెండో సినిమా ‘షమితాబ్’తో మరింత పాపులర్ అయ్యాడు. షహమాస్ నవాబ్ సిద్దిఖీ ధనుష్‌తో సినిమా చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వగానే ప్రేక్షకుల నుండి మంచి స్పందన ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు