బయోపిక్ లో నటించడానికి సన్నహాలు మొదలు పెట్టిన బాలీవుడ్ హీరో !

Published on Jan 13, 2019 12:42 am IST

‘సింబా’ సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ యువ హీరో రణ్వీర్ సింగ్. తెలుగు సూపర్ హిట్ టెంపర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రం ఇటీవల విడుదలై 200కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం తరువాత రణ్వీర్ లెజండరీ ఇండియన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటించనున్నాడు. ’83’ అనే టైటిల్ తో ఖబీర్ ఖాన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో రణ్వీర్, కపిల్ దేవ్ పాత్రలో నటించనున్నాడు. ఈచిత్రం కోసం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు రణ్వీర్. క్రికెటర్ గా కపిల్ దేవ్ బాడీ లాంగ్వేజ్ తదితర విషయాల ఫై ఫోకస్ పెట్టాడు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో తమిళ హీరో జీవా ను తీసుకున్నారు. లండన్ లో ఈ చిత్రం యొక్కషూటింగ్ మొదలుకానుందని సమాచారం.

విష్ణు ఇందూరి నిర్మించనున్న ఈ చిత్రం 2020 ఏప్రిల్ 10న విడుదలకానుంది. ఇక ఈచిత్రం హిందీ తో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More