చిరుతో పోటీకి దిగుతున్న బాలీవుడ్ హీరోలు

Published on Jul 15, 2019 3:21 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా’ అక్టోబర్ 2వ తేదీన విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ తేదీని చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే ఫైనల్ చేసుకుంది. సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అక్టోబర్ 2ను పూర్తిగా చిరుకే వదిలేశారు తెలుగు హీరోలందరూ. ఇప్పటి వరకు ఆ తేదీన మరో తెలుగు సినిమా విడుదల కన్ఫర్మ్ కాలేదు.

కానీ ఉన్నట్టుండి బాలీవుడ్ హీరోలు ఆరోజున తమ సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. వాళ్లే హ్రితిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. వీరిద్దరూ కలిసి నటించిన హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్’ హిందీతో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 2న రానుంది. కొద్దిసేపటి క్రితమే టీజర్ విడుదలచేసి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో కూడా అదే రోజున విడుదల చేయనున్నారు. ఇక హిందీ, తమిళంలో ‘సైరా’ అక్టోబర్ 2నాడే వస్తుండటంతో మూడు భాషల్లోనూ ఈ రెండు చిత్రాల మధ్య పోటీ నెలకొననుంది.

సంబంధిత సమాచారం :

X
More