పుష్ప చిత్రం లోని ఆ పాట రికార్డ్స్ సెట్ చేస్తుంది!

Published on Aug 9, 2021 12:00 am IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ముత్తం శెట్టి మీడియా తో కలిసి నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు కలిసి నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన నటిస్తుండగా, ఈ చిత్రం లో ప్రతినాయకుడి పాత్ర లో ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కానుంది. అయిదు బాషల్లో ఈ ఫస్ట్ సింగిల్ విడుదల కి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దాక్కొ డాక్కో మేక అంటూ తెలుగు లో వస్తుండగా, హిందీ లో జాగో జాగో బక్రే అంటూ రానుంది. అయితే ఈ హిందీ లో ఇందుకు సంబంధించిన ప్రోమో యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. దీని పై హిందీ సింగర్ విశాల్ దడ్లాని స్పందించారు. అల్లు అర్జున్ మరియు దేవీ శ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ లో వస్తున్న పుష్ప చిత్రం లోని జాగో జాగో బక్రే రికార్డ్స్ సెట్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. హిందీ లో ఈ పాట కి రాజీవ్ ఆలం లిరిక్స్ రాయగా, ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 చిత్రాలు రాగా, హ్యాట్రిక్ చిత్రం గా పుష్ప రానుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :