ఎన్టీఆర్ 30 లో విలన్ పాత్రను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్?

NTR30

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం గత వారం ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితం యంగ్ టైగర్ షూటింగ్ లో చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్. ఇటీవల ఎన్టీఆర్ 30 లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, తెలియని కారణాల వల్ల ఎన్టీఆర్ 30లో తారక్ కి విలన్ పాత్రను పోషించే ఆఫర్‌ను సైఫ్ మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్లు సమాచారం.

సైఫ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి మేకర్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినప్పటికీ నిరాకరించారు. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించనున్న నటుడి పేరు త్వరలో వెల్లడికానుంది. ఎన్టీఆర్ 30 పాన్ ఇండియన్ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.

Exit mobile version