కోటి రూపాయల విరాళం ఇచ్చిన ‘స్టార్ హీరో’ !

Published on May 7, 2019 7:36 pm IST

‘ఫోణి తుఫాన్ ’ బీభత్సం కారణంగా ఒడిశాలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం సహక చర్యలను ముమ్మరంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఒడిశా ప్రజలకు అండగా పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు.

కాగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం తన వంతుగా కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అక్షయ్ ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన విరాళాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. ఇక అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటనతో.. మిగిలిన స్టార్ హీరోలు సైతం తమ వంతుగా విరాళాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ‘గజ తుఫాన్ ’ విషయంలో కూడా మొదట స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ విరాళం ప్రకటించగానే మిగిలిన స్టార్ హీరోలందరూ తమ వంతుగా విరాళాలను ప్రకటించారు.

సంబంధిత సమాచారం :

More