టీవీ ఛానల్ ను పెట్టబోతున్న స్టార్ హీరో !

Published on Mar 18, 2019 1:48 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన స్వంత టీవీ ఛానెల్ ప్రారంభించనున్నాడు. ఇప్పటికే టీవీ ప్రొడక్షన్ రంగంలోకి కూడా అడుగు పెట్టిన సల్మాన్ ఇప్పుడు ఏకంగా ‘ఎస్కె టీవీ’ అనే పేరుతో ఓ టీవీ ఛానెల్ ను ప్రారంభించాలనుకోవడం నిజంగా విశేషమే. ఇక తన ఛానెల్ లో ప్రసారం చేయటానికి తన పాత సినిమాల శాటిలైట్ హక్కులను కూడా సల్మాన్ ఖాన్ కొనుగోలు చేసాడు.

కాగా తన టీవీ ఛానల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన లైసెన్సుల కోసం సల్మాన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకూ ఏ స్టార్ హీరోకు స్వంతగా టీవీ ఛానల్ అంటూ లేదు. ఇకనుంచి టీవీ ఛానల్ ఉన్న హీరో సల్మాన్ ఖానే అవుతాడు. ఇంతకీ సల్మాన్ ఈ ఛానల్ ను కొత్త ఫ్యాషన్ లేబుల్, బీయింగ్ చిల్డ్రన్, మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రారంభించబోతున్నాడట.

సంబంధిత సమాచారం :

More