ఆ బాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జై లవకుశలో నటించడం లేదా?


బాలీవుడ్ స్టార్ యాక్టర్ నీల్ నితిన్ ముకేష్ రీసెంట్ గా తమిళ కత్తి సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అతను ఎన్టీఆర్ కొత్త చిత్రం జై లవకుశలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో ఈ మధ్య ఓ ట్రాక్ స్ప్రెడ్ అయ్యింది. అతను ఆల్ రెడీ షూటింగ్ కి జై లవకుశ టీంలో కూడా జాయిన్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. తాజాగా జై లవకుశ చిత్రం యూనిట్ నీల్ నితిన్ ముఖేష్ సినిమాలో చేస్తున్నాడని వస్తున్న రూమర్స్ మీద స్పందించింది. తమ చిత్రంలో ఆ బాలీవుడ్ స్టార్ నటించడం లేదని, అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమె అని తేల్చి చెప్పేసింది. దీంతో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఈ ఉన్న ఈ రూమర్స్ కి తెరపడినట్లు అయ్యింది. అయితే జై లవకుశ షూటింగ్ లో భాగంగా సుమారు రెండు కోట్లు రోపాయిలతో హైదరాబాద్ వేసిన సెట్స్ లో ఎన్టీఆర్ మీద కీలకమైన సన్నివేశాలు ప్రస్తుతం షూట్ జరుపుకుంటున్నాయి.