క్రికెట్ గొడవల్లో సినిమావాళ్లు తలదూర్చారేంటి…!

Published on Jun 7, 2019 5:15 pm IST

స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మొన్న జరిగిన ఇండియా వర్సస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేస్తూ ధరించిన గ్లోవ్స్ పై ఐసీసీ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. ధోని ధరించిన గ్లోవ్స్ పై ఇండియన్ ఆర్మీ కి చెందిన బలిదాన్ గుర్తు తొలగించాలని ఐసీసీ ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ కి ఆదేశాలు పంపించింది. ఐతే ఈ విషయంలో ఐసీసీ నిర్ణయం పై సర్వత్రా విమర్శలు తలెత్తాయి.

ఈ విషయంలో మూవీ ప్రముఖులు ధోనికి మద్దతుగా నిలిచారు. పొలిటికల్ సింబల్ అయిన మూడు సింహాలను ఇంగ్లండ్ జట్టు ధరిస్తుందని, వాళ్లకు కూడా ఐసీసీ ఉన్నట్లయితే రూల్స్ పేరుతో వాటన్నింటినీ ఆపేయాలని అన్నారు. ఈ విషయంలో బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, పరేష్ రావల్,అలాగే హీరో సుధీర్ బాబు వంటి వారు ధోనికి మద్దతు తెలిపారు. బీసీసీఐ కూడా ధోనీకే సపోర్ట్ చేసింది. బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్ ధోనీ గ్లోవ్స్ ని అనుమతించాలని ఐసీసీని కోరారు.

సంబంధిత సమాచారం :

More