టాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్న పవన్ తాతయ్య.!

boman-iran
లేటు వయసులో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతి కాలంలోనే తన టాలెంట్ తో స్టార్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు బొమన్ ఇరానీ. బాలీవుడ్ లో బిజీగా ఉంటూ కూడా బొమన్ ఇరానీ తెలుగులో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించాడు. తను చేసింది చాలా చిన్న పాత్రే అయినప్పటికీ సినిమాలో ఆ పాత్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో బొమన్ ఇరానీకి మంచి పేరు వచ్చింది. దాంతో ఇప్పటికీ బోమన్ ఇరానీ అత్తారింటికి దారేది సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ ని తెగ పొగిడేస్తున్నాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘అత్తారింటికి దారేది షూటింగ్ టైంలో నేను త్రివిక్రమ్ ఎక్కువగా సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. త్రివిక్రమ్ తెలుగు సినిమా ఎన్ సైక్లోపీడియా. అలాగే అతనికి ఫారిన్ సినిమాల గురించి కూడా బాగా తెలుసు అందుకే మేమిద్దరం బాగా చర్చించుకునే వాళ్ళమని’ అన్నాడు. అలాగే తన రాబోయే సినిమా గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం రెండు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాను. ఇక్కడ క్రమశిక్షణ, ఆర్గనైజ్ చేసాక టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయాలని ఉందని’ అన్నాడు.

Exit mobile version