పూజా హెగ్డేతో మీటింగ్ అజిత్ కోసమా.. పవన్ కోసమా

Published on Nov 5, 2019 2:00 am IST

శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ దక్షిణాది మీద ఎక్కువగానే దృష్టి పెట్టారు. వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’
సినిమాను నిర్మించిన ఆయన అజిత్, హెచ్.వినోత్ కలయికలో ‘వలిమై’ అనే సినిమాను కూడా చేస్తున్నారు. అంతేకాదు పవన్ రీఎంట్రీ ఇస్తాడని, ఆ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తారనే ప్రచారం ఉధృతంగా జరుగుతోంది.

ఈ వార్త ఎలా ఉన్నా తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బోనీని కలవడంతో కొత్త వార్తలు మొదలయ్యాయి. వాటిలో అజిత్ సినిమాలో కథానాయకిగా నటించే విషయమై పూజా హెగ్డే, బోనీ కపూర్ కలిశారనేది మొదటిది. ఇంకోవైపు పవన్ హీరోగా చేయాల్సిన ‘పింక్’ రీమేక్లో పూజాను కథానాయకిగా తీసుకోవాలనే ఆలోచనలో బోనీ కపూర్ ఉన్నారనేది రెండో వార్త.

మరి ఈ వార్తల్లో ఏది నిజమవుతుంది.. పూజా అజిత్ సినిమాలో చేస్తుందో లేకపోతే పవన్ సినిమాలో నటిస్తుందో చూడాలి. వీటిలో ఏ ప్రాజెక్ట్ సెట్ అయినా అది పూజాకు పెద్ద బెనిఫిట్ అవుతుండనడంలో సందేహమే లేదు.

సంబంధిత సమాచారం :