శ్రీదేవి పేరు తొలగించమంటే వినరే..!

Published on Aug 21, 2019 12:45 pm IST

ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన హిందీ చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’. కొద్దినెలల క్రితం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ పెద్ద చర్చకు తెరలేపింది. దానికి కారణం ఆ ట్రైలర్ లో నటి శ్రీదేవి జీవితంతో పాటు, ఆమె దుబాయ్ హోటల్ లో మరణించిన తీరున పోలిన విధంగా ఉన్న సన్నివేశాలు చూపించడం జరిగింది. దీనితో ఒక్క సారిగా బోనీ కపూర్ షాక్ గురికావడంతో పాటు, సదరు చిత్ర యూనిట్ కి చిత్ర టైటిల్ లో శ్రీదేవి పేరు తొలగించడంతో పాటు, ఆమె మృతిని పోలిన విధంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని లీగల్ నోటీసులు పంపారు.

ఐతే దీనిపై సదరు మూవీ నిర్మాతలు స్పందించక పోవడంతో బోనీ కపూర్ మరో మారు వారికి లీగల్ నోటీసులు పంపారట. ఎప్పుడో విడుదల కావాల్సిన శ్రీదేవి బంగ్లా మూవీ వాయిదా పడుతూ వస్తుంది.

సంబంధిత సమాచారం :