Border 2 Release: థియేటర్ల వద్ద సన్నీ డియోల్ ఫ్యాన్స్ నిరాశ.. కానీ అంతలోనే గుడ్ న్యూస్, అసలేం జరిగిందంటే?

Border 2 Release: థియేటర్ల వద్ద సన్నీ డియోల్ ఫ్యాన్స్ నిరాశ.. కానీ అంతలోనే గుడ్ న్యూస్, అసలేం జరిగిందంటే?

Published on Jan 23, 2026 12:01 PM IST

Border 2 Release

సన్నీ డియోల్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘బోర్డర్ 2’ (Border 2 Release) కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘బోర్డర్’ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈరోజే (జనవరి 23) గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు ఉదయాన్నే ఊహించని షాక్ తగిలింది. ఇండియా వ్యాప్తంగా పలు చోట్ల ఈ సినిమా ఎర్లీ మార్నింగ్ షోలు (Morning Shows) రద్దయ్యాయి.

Border 2 Release : అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే?

అసలు విషయం ఏంటంటే… సినిమాకు సంబంధించిన ‘కంటెంట్’ థియేటర్లకు చేరడంలో ఆలస్యం జరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. సాధారణంగా సినిమా ప్లే అవ్వాలంటే రిలీజ్ టైమ్‌కి డిజిటల్ ప్రింట్లు లేదా కీ (Key) థియేటర్లకు అందాలి. కానీ, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ ప్రాసెస్ లేట్ అయ్యింది. దీంతో ఉదయం ప్రదర్శించాల్సిన షోలను థియేటర్ యాజమాన్యాలు నిలిపివేయాల్సి వచ్చింది.

ఉదయాన్నే తమ అభిమాన హీరో సినిమా చూద్దామని థియేటర్లకు వచ్చిన ఆడియన్స్, షో క్యాన్సిల్ అవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలా చోట్ల ఫ్యాన్స్ థియేటర్ల బయట పడిగాపులు కాస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా చర్చ జరిగింది.

Border 2 Release : 10 గంటల నుంచి షోలు షురూ!

అయితే, ఫ్యాన్స్ ఎక్కువ సేపు కంగారు పడాల్సిన అవసరం రాలేదు. సినిమా ‘కంటెంట్’ డెలివరీలో వచ్చిన టెక్నికల్ సమస్యను డిస్ట్రిబ్యూటర్లు వెంటనే పరిష్కరించారు. దీంతో ఉదయం 10 గంటల (10 AM) నుంచి అన్ని చోట్ల షోలు మొదలయ్యాయి. కేవలం తెల్లవారుజామున పడాల్సిన బెనిఫిట్ షోలు, ఎర్లీ షోలపై మాత్రమే ఈ ప్రభావం పడింది తప్ప, రెగ్యులర్ షోలకు ఎలాంటి ఇబ్బంది లేదని సమాచారం. ప్రస్తుతం సినిమా ఎలాంటి ఆటంకం లేకుండా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు