బాస్ కి బాక్సాఫీస్ దాసోహం.. రికార్డు ఓపెనింగ్స్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu). మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ ప్రీమియర్స్ ని సెట్ చేసుకుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో కూడా మెగాస్టార్ కి ఒక్క సరైన సినిమా పడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది.

మరి ఫ్యామిలీస్ ని థియేటర్స్ కి రప్పిస్తున్న ఈ సినిమా ప్రీమియర్స్ ఇంకా డే 1 వసూళ్లుగా రికార్డు ఓపెనింగ్స్ ప్రపంచవ్యాప్తంగా రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ (Mana Shankara Vara Prasad Garu) సినిమాకి ఏకంగా మొదటి రోజుకి (ప్రీమియర్స్ కలిపి) 84 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ ని తనకి దాసోహం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

మన సీనియర్ హీరోస్ లోనే కాకుండా రీజనల్ గా ఇది ఒక బిగ్గెస్ట్ రికార్డు ఓపెనింగ్ అని కూడా చెప్పొచ్చు. అంతే కాకుండా మెగాస్టార్ పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహా రెడ్డి ఓపెనింగ్స్ తో సమానమైన ఓపెనింగ్స్ ఈ సినిమా సెట్ చేయడం నిజంగా హిస్టారికల్ అని చెప్పవచ్చు. దీనితో లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా మరిన్ని రికార్డులు సెట్ చేయడం గ్యారెంటీ అని చెప్పడంలో డౌట్ లేదు.

Exit mobile version