‘జూన్’లో మొదలు కానున్న బోయపాటి సినిమా !

‘జూన్’లో మొదలు కానున్న బోయపాటి సినిమా !

Published on Feb 28, 2019 10:44 PM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ పూర్తి అయ్యాక ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. కాగా తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ను ‘జూన్’ నుండి మొదలుపెట్టనున్నారు. కాగా గతంలో బాలయ్యకి ‘సింహ, లెజెండ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన బోయపాటి, ఈ సారి అలాంటి సూపర్ హిట్ ని ఇచ్చి.. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి.

అయితే ఈ కొత్త చిత్రం పై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు