బోయపాటి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడట !

Published on Feb 27, 2019 7:48 pm IST


డైరెక్టర్ బోయపాటి శ్రీను ,మైత్రి మూవీ మేకర్స్ లో సినిమా చేస్తానని గతంలో వారి దగ్గరి నుండి అడ్వాన్స్ తీసుకున్నాడట. అయితే 6 సంవత్సరాలైన ఇంతవరకు సినిమా చేయకపోవటం అలాగే ఇటీవల బోయపాటి డైరెక్ట్ చేసిన వినయ విధేయ రామ డిజాస్టర్ కావడంతో మైత్రి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయాలని ఆయనను ఒత్తిడి చేశారట. దాంతో చేసేదేమిలేక బోయపాటి తను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడట.

ఇక బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేసే పనిలో వున్నాడు. సమ్మర్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ , లెజెండ్ భారీ విజయాలు సాధించడంతో ఈ కొత్త చిత్రం ఫై మంచి అంచనాలే ఉన్నాయి. బాలయ్య సొంత బ్యానర్ ఎన్ బి కె ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :