“అఖండ” రిలీజ్‌పై ఓ క్లారిటీ ఇచ్చిన బోయపాటి..!

Published on Jul 1, 2021 2:13 am IST


నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌లో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న అఖండపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను ఏ మాత్రం తలకిందులు చేయకుండా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే మనకు అర్ధమయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నప్పటికి రిలీజ్ ఎప్పుడన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.

అయితే తాజాగా దర్శకుడు బోయపాటి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖండ రిలీజ్‌పై ఓ క్లారిటీ ఇచ్చారు. ఒక పాట, క్లైమాక్స్, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ సీన్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని అన్నారు. చివరి దశ షూటింగ్ హైదరాబాద్‌లో చేయడానికి వర్షాలు ఇబ్బందిగా మారాయని అందుకే సరైన లొకేషన్ కోసం వెతుకుతున్నామని, ముఖ్యంగా కడపలో లొకేషన్స్ చూస్తున్నామని తెలిపారు. అయితే కరోనా థర్డ్ వేవ్ అంటున్నారని, పరిస్థితులు చక్కబడ్డాకే అఖండను విడుదల చేయాలనుకున్నామని బోయపాటి చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :