‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా..’ వైరల్ మీమ్‌పై బోయపాటి రియాక్షన్

‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా..’ వైరల్ మీమ్‌పై బోయపాటి రియాక్షన్

Published on Dec 20, 2025 1:30 AM IST

Akhanda-2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2 – తాండవం’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేశారు. దీనికోసం ఈ చిత్రాన్ని నార్త్‌లోనూ భారీగా ప్రమోట్ చేశారు మేకర్స్. అయితే, ఈ ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి, బాలయ్య హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని ఓ డైలాగు సోషల్ మడియాలో వైరల్‌గా మారింది.

అఖండ 2 చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి హిందీలో చెప్పిన ‘‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా.. కాషన్ కియా’’ డైలాగ్ వైరల్ కావడంతో మీమర్స్ దాన్ని బాగా ట్రెండ్ చేశారు. అయితే, ఇప్పుడు తనపై వచ్చిన ఈ మీమ్‌కు బోయపాటి రియాక్ట్ అయ్యారు. తాజాగా థమన్, బోయపాటి కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సింగర్ సునీత ఈ వైరల్ మీమ్‌ను వినిపించారు. దీంతో ఆయన తన మనసులో నుంచి వచ్చిన హిందీ భాషను మాట్లాడానని.. అందులో ఏం తప్పులేదని.. బోయపాటి కామెంట్ చేశారు.

ఇక థమన్ కూడా ఈ మీమ్‌పై రియాక్ట్ అయ్యారు. ‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా.. మైనే సౌండ్‌పై కాషన్ కియా, ఇన్హోనే సినిమాపై కాషన్ కియా’ అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అఖండ 2 చిత్రం ప్రస్తుతం స్టడీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతుంది.

తాజా వార్తలు