బాలయ్య, రామ్ ఫ్యాన్స్ కి బోయపాటి థాంక్యూ నోట్ …. !!

Published on Jul 2, 2022 11:00 pm IST

టాలీవుడ్ లో మాస్ మూవీస్ తీయడంలో మంచి దిట్టగా పేరుగాంచిన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన అఖండతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. కాగా త్వరలో ఎనర్జిటిక్ స్టార్ తో తన నెక్స్ట్ మూవీ తీయనున్నారు బోయపాటి. ఇక లేటెస్ట్ గా రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్, యాక్షన్ మూవీ ది వారియర్.

కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుక నిన్న అనంతపూర్ లో ఎంతో వైభవంగా జరుగగా, బోయపాటి శ్రీను, తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఈ వేడుకకి అతిథులుగా విచ్చేసి ట్రైలర్ ని లాంచ్ చేసారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం అనంతపూర్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, అక్కడి ప్రజల ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని, అలానే ముఖ్యంగా బాలయ్య, రామ్ ఫ్యాన్స్ ఫంక్షన్ లో తనపై చూపించిన ప్రేమాభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు బోయపాటి శ్రీను.

సంబంధిత సమాచారం :